టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు ..... పవన్ కళ్యాణ్ & ప్రభాస్ !

inner-page-banner


గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. మొదట్లో అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొన్నేళ్ల పాటు కొనసాగారు. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ కూడా అగ్ర హీరోగా కొన్నేళ్ల పాటు తన హావ చూపించారు. ఇక ఆ తరువాత టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని హీరోగా ఎన్నో ఏళ్ళు అగ్ర స్థానంలో కొనసాగారు. ఈ తరుణంలోనే మెగాస్టార్ సినిమాల నుండి రాజకీయాలలోకి వెళ్లారు.  టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అన్న దానిపై ఎక్కువగా చర్చలు జరిగాయి. ఆ తరువాత మెగాస్టార్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో అయన స్థానానికి ఎటువంటి డోఖాలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా కి తిరుగులేదు అని నిరూపించుకొని .. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి అజ్ఞాతవాసి సినిమా తరువాత ప్రజల కోసం ఏదైనా మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి .. తనదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ మద్యే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే వీరిద్దరూ రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి ..అలాగే వీరిద్దరి ఇమేజ్ కూడా వేరు కాబట్టి వీరిద్దరూ కాకూండా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

అయితే , ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ , మార్కెట్ పరంగా చూసుకుంటే ముందుగా చెప్పుకోవాల్సిన రెబల్ స్టార్ ప్రభాస్ , సూపర్ స్టార్ మహేష్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్. ఇక ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్ లో ఉండే ప్రభాస్ ...టాలీవుడ్ అగ్ర హీరోగా మారడానికి ప్రధాన కారణం రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి. ఐదేళ్ల కాలం పాటు ప్రభాస్ కస్టపడి ..చేసిన ఈ బాహుబలి 1 , 2 ..ఆ కాలానికి తగిన ప్రతిఫలం ఇచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ అంటే ఒక్క తెలుగు సినిమా హీరోనే కాదు ... పాన్ ఇండియా స్టార్. ఇక బహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో కూడా పాన్ ఇండియా చిత్రంగానే తెరకెక్కింది. ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినప్పటికీ ..కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది. మొత్తంగా క్రేజ్ కానీ , మార్కెట్ పరంగా కానీ , చూసుకుంటే ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని చెప్పవచ్చు. ప్రస్తుతం రాధే శ్యాం , ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తున్నారు.

మహేష్ బాబు ... సూపర్ స్టార్ కృష్ణ నటవాసుడిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తోలి నుండి కూడా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలకి ఉన్న క్రేజ్ తెలియనిది కాదు ..మహేష్ నుండి సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఉండే సందడి మరో లెవెల్ ఉంటుంది. ఒక్కసారి కనుక మహేష్ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే వచ్చే కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లోనే ఉంటాయి. ప్రస్తుతం మహేష్ కి ఉన్న క్రేజ్ రీత్యా మహేష్ సినిమా కి సూపర్ హిట్ టాక్ వస్తే ..మినిమమ్ 150 నుండి 200 కోట్లు కొత్తగొట్టడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తంగా మహేష్ బాబు కూడా టాలీవుడ్ అగ్ర స్థానం కోసం పోటీ పడుతున్నాడు.

ఇకపోతే ఎన్టీఆర్ ..ఈ నందమూరి బుడ్డోడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. మాస్ సినిమాలకి పెట్టింది పేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైలాగ్ చెప్తే ఎవరైనా కూడా చప్పట్లు కొట్టాల్సిందే. తన సినీ కెరియర్ మొదటి నుండి మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ .. ఆ సినిమాలతోనే టాలీవుడ్ అగ్ర హీరోలలో చోటు సంపాదించుకున్నాడు. మధ్యలో కొన్ని రోజులు వరుస పరాజయాలతో సతమతమైనప్పటికీ ..ఆ తరువాత టెంపర్ సినిమాతో మళ్లీ రేసులో నిలబడ్డాడు. సినిమా సినిమాకి తన నటన లో కొత్తదనం చూపిస్తూ అగ్ర స్థానం కోసం పోటీపడుతున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉండే బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.

ఇక నెంబర్ వన్ హీరో రేసులో ఉన్న మరో హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ...మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ..రెండో సినిమా మగధీరతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగిన చరణ్..మాస్ సినిమాలతోనే అభిమానులకి చాలా దగ్గరైయ్యాడు. ఇక చరణ్ కి నటన రాదు అని కొంతమంది విమర్శించేవారికి ..రంగస్థలం సినిమాతోనే సమాధానం చెప్పాడు. ఆ సినిమాలో చరణ్ నటనకి అవార్డుల పంట పండింది. చెవిటి వాడిగా చరణ్ నటన అద్భుతం. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ  మెగా హీరో కూడా అగ్ర స్థానం రేసులో ముందున్నాడు.

ఇక మరో హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ... టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో అల్లు అర్జున్. సినిమా సినిమా కి తన స్టైల్ మార్చుతూ అభిమానులకి కనులవించు చేస్తున్నాడు. అలాగే ప్రతి సినిమాలో కొత్త కొత్త స్టెప్స్ తో అందరిని ఆకట్టుకుంటారు. గంగోత్రి సినిమాతో హీరోగా  ఎంట్రీ ఇచ్చిన బన్నీ ..ఆ తరువాత వరుస హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చోటు సంపాదించాడు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ సినిమాలకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సినిమాకి  హిట్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామినే. ఈ మెగా హీరో కూడా అగ్ర స్థానం కోసం రేసులో ఉన్నాడు.

మొత్తంగా చూస్తే ... టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుత క్రేజ్ దృష్ట్యా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ హీరో అని చెప్పవచ్చు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube