సోషల్ మీడియాలో జగన్ పెళ్లి ఫోటో, పెళ్లి పత్రిక !

inner-page-banner

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భారతిల పెళ్లిరోజు. 1996 ఆగస్టు 28న వైఎస్ జగన్, భారతిరెడ్డిలకు వివాహం జరిగింది. 24 వసంతాలు పూర్తయ్యాయి. జగన్, భారతిరెడ్డిలకు ఇద్దరు కుమార్తెలు. హర్షరెడ్డి, వర్షారెడ్డి. హర్షారెడ్డి ఇటీవల పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ పొందారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి. ఈ సందర్భంగా  వైఎస్ జగన్, భారతిరెడ్డి ల ఫొటోను , వారి పెళ్లి కార్డు ను  తన ఫేస్ బుక్‌ అకౌంట్‌ లో పోస్ట్ చేశారు  పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూన్న ఆ  ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతిలకు పెళ్లిరోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండో  వివాహ వార్షికోత్సవం కావటంతో షర్మిళతో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు.

Also Read:వైఎస్సార్‌‌-వేదాద్రి"శ్రీకారం చుట్టిన సీఎం జగన్ !

ఇక పెళ్లిరోజున ‘వైఎస్సార్‌ వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి వీడియో లింక్‌ ద్వారా శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ ప్రాజెక్టు వల్ల ఎకరాకు రూ.10 లక్షల రూపాయల విలువ పెరిగిందని.. రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతు బాంధవుడిగా సీఎం నిలిచిపోతారన్నారు. సీఎం వచ్చిన వేళా విశేషం కారణంగా మంచిగా వర్షాలు పడ్డాయని, నీళ్లు అందుతున్నాయన్నారు. పెళ్లి రోజున ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube