వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభం.. ఖాతాల్లో రూ. 18,750 జమ

inner-page-banner


కరోనా కోరలు చాచుకొని కూర్చున్న ఈ సమయంలో కూడా  అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. నేడు వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ  పథకం ద్వారా 24లక్షల నుండి 25 లక్షల మంది మహిళలు లబ్ది పొందనున్నట్టు చెబుతున్నారు.  


Also Read:జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ మొత్తాన్ని వారికి అందించనుంది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్ చేయూత పథకానికి రూ. 4,700 కోట్లు కేటాయించినట్టు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు మంచి జరగాలని ఆయన ఆకాక్షించారు. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తామని... ఇందుకోసం ఇప్పటికే అమూల్, పీ అండ్ జీ, హెచ్‌యూఎల్, ఐటీసీ వంటి కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నామని.. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని అన్నారు. కోళ్లు, పాడిపశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర వ్యాపారం, తదితర లాభసాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వమిచ్చే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని సీఎ జగన్ అన్నారు. బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు.

.Also Read: వైసీపీ సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube