వైసీపీ సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత

inner-page-banner

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సాంబశివరాజు రెండు సార్లు మంత్రిగా, ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1989-94 లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 


అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్‌గా సాంబశివరాజు ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  కాగా 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహారించారు. నామినేటెడ్ పదవి రేసులో పెనుమత్స పలుమార్లు జగన్‌ని కలిశారు.అయన మరణం పై వైస్సార్సీపీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు .

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube