news
మేష రాశి

మేష రాశి వారు తమ జీవితాన్ని చాలా ధైర్యంగా గడుపుతారు. వీరికి ఇప్పటివరకు ప్రధాన సమస్యగా ఉన్న ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రోజులుగా పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి విముక్తులవుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాల పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యంలో స్వల్ప ఒడిదుడుకులు వుంటాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. సంతానం భవిష్యత్తుపై కొంత శ్రద్ధ పెడితే అంతా మంచే జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు దుర్గమ్మ తల్లిని ఎర్రని పూలతో, వరసిద్ధి వినాయకుడిని గరికతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కనిపిస్తుంది. ఈ ఏడాది మొత్తం అనుకున్నది జరుగుతుంది.

news
వృషభ రాశి

వృషభరాశి ఇది రాసులల్లోకెల్లా చాలా బలవంతమైన రాశి గా చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన వారు అందరూ కూడా జీవితంలో గొప్ప ప్రేమికులుగా మిగిలిపోతారు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. జనవరి తరువాత వీరి జీవితంలో చాలా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనలకు అనుకూలం. సొంత వ్యాపారాలే వీరికి చాలా శ్రేయస్కరం. వీరికి సంబంధించిన వారి కోసం ఎలాంటి సహాయం చేయడానికైనా వెనుకాడరు . ఏదైనా సాధించాలి అని పట్టు పడితే ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. ఈ రాశివారు లక్ష్మీగణపతిని తెల్లనిపూలతో పూజించి ఇష్టకామేశ్వరి దేవిని ఎర్రని పూలతో పూజించడం వల్ల సమస్యలు తొలగి మానసికంగా కుదుటపడతారు. మొత్తంగా ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త వహిస్తే ..జీవితంలో ఉన్నత స్థానాలని చేరుకోవచ్చు.

news
మిథున రాశి

మిథునరాశి ఎక్కువగా ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు , ఎవరి దృష్టి అయినా తమ వైపు ఆకర్షించి గల శక్తి వీరి సొంతం. కన్యా రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ గానే ఉంటుంది. మీరు ఏదైనా కార్యం చేయదలిస్తే అది కచ్చితంగా విజయం సాధించాల్సిందే.  ఈ రాశివారికి ఈ ఏడాది ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం డబ్బు పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఆదాయ వ్యయాల్లో ఒడిదుడుకులు తప్పవు. అయినప్పటికీ స్వయం కృషితోనే రాణిస్తారు. పట్టుదలతోనే అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాలపై దృష్టి పెడతారు. బంధువులతో సంబంధాలు వికటిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించడం ఉత్తమం. నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కాబట్టి ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిత్యం లలితా సహస్రనామం పఠనం శుభదాయకం. 

news
కర్కాటక రాశి

ఈ కర్కాటక రాశి వారికీ రాబోయే రోజులు  అన్ని మంచి రోజులే, అనుకున్న లక్ష్యాలు అన్ని పూర్తి అయ్యి ..మంచి జీవితాన్ని పొందుతారు. ఆదాయ వ్యయాలు ఈ ఏడాది పొడువునా  సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం కూడా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. కొంచెం ప్రత్యర్థుల కదలికలపై దృష్టి పెడితే మరిన్ని లాభాలు చేకూరుతాయి. ఎవరినీ అతిగా నమ్మకపోవడమే మంచిది.  ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.  సంతానానికి నిదానం ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులుంటాయి. పెట్టుబడులకు అనుకూలించవు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశివారు ఈశ్వరుని ఆరాధించడం వల్ల, నారాయణ స్తోత్రం చదవడం వల్ల ఉన్న సమస్యలు తొలగిపోయి అంతా శుభం కలుగుతుంది.

news
సింహ రాశి

ఈ రాశి వారు రాబోయే రోజులు  కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కఠినమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన సమస్యలపై  సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు నడవాలి. ఆలా చేయగలిగితే ఈ ఏడాది అధికమైన ఆదాయం పొందే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని అవమానాలు ఎదురుకావచ్చు. కానీ, వాటికీ క్రుంగి పోకుండా ఎదిరించి నిలబడితే మిమ్మల్ని మించే వారే లేరు. వీరికి ఈ ఏడాది పెట్టుబడులకు అనుకూలం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బాగా బలపడతాయి. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమించాల్సి రావచ్చు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు...కానీ , కొంచెం కష్టపడితే మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.   మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారు ఉంటే ..ఈ ఏడాది మానుకోవడం మంచిది. ఈ రాశి వారు ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి.

news
కన్యా రాశి

ముఖ్యంగా ఈ రాశి వారు పెట్టె ఖర్చు పైన కొంత మనసు పెట్టాలి. ఖర్చు పెట్టె ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. వీరికి   అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి.అలాగే ఇప్పటివరకు రుణ సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.  బంధువులతో ఎప్పుడో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు  ఈ సమయం చాలా అనుకూలం. తరచు వేడుకలు, దైవ పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం కలిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి కొంచెం జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఈ ఏడాది గజలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది

news
తులా రాశి

తులారాశి వారికీ వచ్చే నెల  ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు. అయినా భయపడకుండా అడుగు ముందుకు వేస్తే మీరు అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలరు. ఆర్థికంగా కొంచెం ఫర్వాలేదనిపిస్తుంది. ఇంట్లోని  శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ఉన్నత పదవుల కోసం ఆశపడేవారు కొంచెం శ్రమించాల్సి రావచ్చు , అయినప్పటికీ పదోన్నతి కచ్చితంగా దక్కుతుంది అని చెప్పలేము.  కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త నిర్మాణాలు చేపడతారు. అధికారులకు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులు అనుకూలించవు. భాగస్వామిక వ్యాపారాలకు తరుణం కాదు. కాంట్రాక్టులు, ఏజెన్సీ దక్కించుకుంటారు. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.  సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన ఈ రాశివారికి కలిసివస్తుంది. తరుచు శివునికి అభిషేకం, శనీశ్వరునికి తైలాభిషేకం చేయించిన మనశ్శాంతి, ఆశించిన ఫలితాలు పొందుతారు.

news
వృశ్చిక రాశి

ఇక ఆ తరువాత రాసి వృచ్చిక రాశి..ఈ రాశి వారికీ  ఆగస్ట్  తరువాత అన్ని శుభపరిణామాలే. ఇప్పటివరకు ఉన్న అన్ని సమస్యలు తిరి హాయిగా జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి.  విపరీతమైన ఆదాయం వస్తుంది. దాన్ని నిలువ చేసుకోవడానికి కొంచెం కష్టపడితే మంచి జీవితం ఉంటుంది. సంతానం కోసంశ్రమించేవారికి ఆ సమస్య కి పరిస్కారం దొరుకుతుంది. ఆత్మీయుల సాయంతో కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. స్థిరాస్తులలో పెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోదరులతో సంప్రదింపులు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పాస్‌పోర్టు, వీసాలు పొందుతారు. ఈ రాశివారు  కార్తీకేయుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.

news
ధనుస్సు రాశి

ఈ రాశివారికి అంతా శుభయోగంమే. రుణ సమస్యల నుంచి బయటపడుతారు. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఎక్కువగా వుంది. ఆదాయం బాగుంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. తరుచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పెట్టుబడులకు చాలా అనుకూలం. స్వయం కృషితో రాణిస్తారు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువులు చేరువవుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు. ఈ రాశి వారు శ్రీమన్నారాయణుడిని పున్నాగపూలతో పూజించడం వల్ల శుభం, జయం కలుగుతుంది.

news
మకర రాశి

 ఈ మకరరాశి వారికీ 2020 ఆగస్ట్ తర్వాత  నుండి ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. మొదలుపెట్టిన ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది. అలాగే ఆదాయం పుష్కలంగా ఉంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. కొత్త బంధుత్వాలు నెలకొంటాయి. పొదుపు పథకాలు అనుకూలిస్తాయి.  గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. తరుచూ వ్యవహారాల్లో పాల్గొనవలసి వస్తుంది. సమాజంలో పేరు , ప్రఖ్యాతలు దక్కించుకుంటారు. పరిచయస్తులు మీ సహాయ సహకారాలు ఆశిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంస్థల స్థాపనలు, నూతన వ్యాపారాలకు అనుకూలం. స్థలం, గృహమార్పు కలిసివస్తాయి. విద్యార్థులు చక్కని ఫలితాలు సాధిస్తారు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్వయంకృషితో రాణిస్తారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. అధికారులకు హోదామార్పు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా లేక విన్నా చాలామంచిది.

news
కుంభ రాశి

 ఈ రాశివారికి ఏళ్లనాటి  శని తగ్గిపోయి , మంచి సమయం మొదలుకాబోతుంది.  కానీ , ఒత్తిడి, ఆందోళనలు కొంచెం అధికంగా వుంటాయి. మూడు నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించండి ఉత్తమం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి, అదుపులో పెట్టుకుంటే మంచిది. ఈ ఏడాది మొదట్లో పెట్టుబడులకు మంచి తరుణం కాదు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతుంటాయి. పట్టుదలతో ప్రయత్నం సాగించాలి..కచ్చితంగా విజయం మీదే. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ఆత్మీయుల ప్రమేయంతో సమస్యలు సద్దుమణుగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి.  స్థలమార్పు కలిసివస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఏ పురోగతి ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం.  నిత్యం దైవారాధన చేయడం మంచింది.

news
మీన రాశి

 ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. ఆస్తి వివాదాలు, భూ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. పెద్దల ప్రమేయంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటలని అదుపులో పెట్టుకోవాలి. కోపం పనికిరాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. నోటీసులు అందుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పదవుల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు ఉంటుంది.  రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధ్యాయుల బదిలీ యత్నం ఫలిస్తుంది.వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తి, ఉఫాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. కోర్టు కేసులు అలానే కొనసాగుతుంటాయి. గణపతి హోమం చేయించుకుంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ప్రతికూల శక్తుల తీవ్రత కూడా తగ్గుతుంది.